Share News

సర్కారు స్పందించాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 11:07 PM

తమ సమస్యలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట శిబిరం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

 సర్కారు స్పందించాలి
నిరసన తెలుపుతున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు

బెలగాం, జనవరి 7: తమ సమస్యలపై వైసీపీ ప్రభుత్వం స్పందించాలని సమగ్ర శిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం కలెక్టరేట్‌ ఎదుట శిబిరం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నా.. సీఎం జగన్‌ స్పందించకపోవడం దారుణమన్నారు. చిరుద్యోగులపై నిర్లక్ష్యం తగదన్నారు. నోటీసులు ఇచ్చి కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. విధుల నుంచి తొలగిస్తామని బెదిరించినా భయపడేది లేదని వెల్లడించారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీం కోర్టు తీర్పు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్కారు స్పందించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని వారు తెలిపారు. యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, పీఆర్టీయూ నాయకులు మురళీమోహనరావు, ఎన్‌.బాలకృష్ణారావు, కాగాన విజయ్‌ తదితరులు దీక్ష శిబిరానికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 11:07 PM