Share News

కంపెనీకి అనుకూలం.. కాలుష్యానికి వ్యతిరేకం

ABN , Publish Date - Mar 14 , 2024 | 12:16 AM

మండలంలోని కంటకా పల్లి, చిన్నపాలెం గ్రామాల్లో సుమారు 73 ఎకరాల్లో 685 కోట్లతో నిర్మించ బోతున్న అల్ర్టాటెక్‌ సిమెంట్‌ కర్మాగా రానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బుధవారం దన్నినపేట వద్ద డీఆర్వో ఎస్‌డి.అనిత ఆధ్వర్యంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో కాలుష్యానికి వ్యతిరేకంగా గళం వినిపించారు.

కంపెనీకి అనుకూలం.. కాలుష్యానికి వ్యతిరేకం

లక్కవరపుకోట (కొత్తవలస), మార్చి 13: మండలంలోని కంటకా పల్లి, చిన్నపాలెం గ్రామాల్లో సుమారు 73 ఎకరాల్లో 685 కోట్లతో నిర్మించ బోతున్న అల్ర్టాటెక్‌ సిమెంట్‌ కర్మాగా రానికి ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బుధవారం దన్నినపేట వద్ద డీఆర్వో ఎస్‌డి.అనిత ఆధ్వర్యంలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో కాలుష్యానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. శారద, జిందాల్‌ స్టీల్‌ ఎక్సేంజ్‌ ఇండియా, మహామాయా వంటి కంపెనీలు వదులు తున్న కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పశువులు, పక్షులు, కోళ్లు, మేకలు, గొర్రెలు వంటి మూగ జీవాలకు భద్రతలేని స్థితి ఏర్పడిందని స్థానిక నేతలు ఎల్‌.సూర్యనారాయణ, సత్యనారాయణ, రమణ తదిత రులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సిమెంట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదని, కానీ పొల్యూషన్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని, స్థానికులకు ఉపాధి కల్పించాల న్నారు. పొల్యూషన్‌కి లోబడి కంపెనీని ఏర్పాటు చేస్తామని యాజమాన్యం తెలి పింది. ఈ కార్యక్రమంలో పొల్యూషన్‌ బోర్డు ఇంజినీర్‌ బీబీ.సరిత, వివిధ గ్రామా లకు చెందిన ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Updated Date - Mar 14 , 2024 | 12:16 AM