రైతులకు ఇష్టమైన విత్తనాలే ఇవ్వండి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:06 AM
రైతులు ఏ రకం వరి సాగు చేయడానికి మొగ్గు చూపుతారో వాటిని సరఫరా చేసి ఎంవోయూ తీసుకోవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏపీ సీడ్స్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.

సాలూరు రూరల్: రైతులు ఏ రకం వరి సాగు చేయడానికి మొగ్గు చూపుతారో వాటిని సరఫరా చేసి ఎంవోయూ తీసుకోవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఏపీ సీడ్స్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఏపీ సీడ్స్ అధికారులు ఎంవోయూ పద్ధతిలో అధికంగా ఆర్జేఎల్ రకం వరి విత్తనాలు ఇస్తామని, 1064 తక్కువ మొత్తంలో ఇస్తామని రైతులకు చెప్పడంతో వారు ఆదివా రం ఆమెకు సమస్యను వివరించారు. సాలూరు ప్రాంతంలో 1064 రకం వరి సాగుకే ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారని రైతుల పక్షాన మాజీ ఏఎంసీ అధ్యక్షుడు కేతిరెడ్డి చంద్రశేఖర్ ఆమెకు వివరించా రు. వరి రకాలు, సాగు తదితర వాటికి వివరించారు. ఈ మేరకు ఆమె ఏపీ సీడ్స్ మార్కెటింగ్ రాష్ట్ర అధికారి జలంధర్‌కు ఫోన్ చేశారు. రైతులు కోరిన వరి రకం సాగును ప్రోత్సహించాలన్నారు. ఆర్జేఎల్‌తో పాటు 1064 రకం వరి సైతం సాగు ప్రోత్సాహించాలని ఆదేశించారు. దీంతో రైతులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లా డుతూ ఫీడర్ అంబులెన్స్ డ్రైవర్లను తొలగించబోమని, మన్యంలోని వారి సేవలను కొనసాగిస్తామని తెలిపారు. కాంట్రాక్టు ట్రైబుల్ టీచర్ల సమస్య పరిష్కారా నికి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తాన ని చెప్పారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని రాష్ట్ర మంత్రి సంధ్యారాణికి సాలూరు సర్కిల్ ప్రభుత్వ మద్యం షాపుల సూపర్‌వైజర్లు, సేల్స్‌మేన్లు ఆదివారం వినతిపత్రం అందించారు. తాము కాంట్రాక్ట్ పద్ధతిలో మద్యం షాపుల్లో పనిచేస్తున్నామని, తమను కొనసాగించేలా సీఎం చంద్రబాబు దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని వారు కోరారు.