Share News

రహదారిపై ఘీం‘కరి’ంపు

ABN , Publish Date - Apr 04 , 2024 | 12:03 AM

మండలంలోని గవరమ్మపేటలో బుధవారం ఉదయం గజరాజులు హల్‌చల్‌ చేశాయి. తోటపల్లి - గుణుపూర్‌ ప్రధాన రహదారిపై సంచరించడంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రహదారిపై ఘీం‘కరి’ంపు
గవరమ్మపేట వద్ద ప్రధాన రహదారిపై సంచరిస్తున్న ఏనుగులు

జియ్యమ్మవలస, ఏప్రిల్‌ 3 : మండలంలోని గవరమ్మపేటలో బుధవారం ఉదయం గజరాజులు హల్‌చల్‌ చేశాయి. తోటపల్లి - గుణుపూర్‌ ప్రధాన రహదారిపై సంచరించడంతో ప్రజలు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు అర కిలో మీటరు పరిధిలో సుమారు గంట పాటు అవి అక్కడే తిరగడంతో స్థానికులు, ప్రయాణికులు హడలెత్తిపోయారు. ఏనుగులు ఎవరిపై దాడి చేస్తాయోనని భయాందోళన చెందారు. ఈ విషయం తెలుసుకున్న ట్రాకర్స్‌ అక్కడకు చేరుకుని గజరాజులను ఆ గ్రామ సమీపంలోని పొలాల్లోకి వెళ్లేలా చేశారు. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ దారిలో యథావిధిగా రాకపోకలు సాగించారు. అయితే పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు వరి, అరటి, జొన్న చేలను పాక్షికంగా ధ్వంసం చేశాయి. సాయంత్రా నికి అరటి తోటలో తిష్ఠ వేశాయి. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాంతం నుంచి తక్షణమే ఏనుగులను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 04 , 2024 | 12:03 AM