Share News

అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:41 PM

అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుంది. వాటిని పునరుద్ధరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి పేదలు జై కొడుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే వాటిని ప్రారంభించనుంది. ప్రభుత్వ ఆదేశంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. గోడలకు బూజు దులపడం.. ఆవరణాన్ని శుభ్రం చేయించే పనులకు ఆదేశించారు. ఇతర కార్యాలయాలకు వినియోగిస్తూ ఉంటే ఖాళీ చేయించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. పట్టణాల్లోని కమిషనర్లు, ప్లానింగ్‌ అధికారులకు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల్లోనే మళ్లీ క్యాంటీన్లు పేదలతో కళకళలాడనున్నాయి.

అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం
విజయనగరం: అన్న క్యాంటీన్‌ పరిసరాలను శుభ్రం చేస్తున్న దృశ్యం

అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం

రంగంలోకి దిగిన అధికారులు

వాటికి పూర్వ కళ తీసుకొచ్చే చర్యలు ప్రారంభం

ఎదురుచూస్తున్న పేదలు

అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుంది. వాటిని పునరుద్ధరించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయానికి పేదలు జై కొడుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే వాటిని ప్రారంభించనుంది. ప్రభుత్వ ఆదేశంతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. గోడలకు బూజు దులపడం.. ఆవరణాన్ని శుభ్రం చేయించే పనులకు ఆదేశించారు. ఇతర కార్యాలయాలకు వినియోగిస్తూ ఉంటే ఖాళీ చేయించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. పట్టణాల్లోని కమిషనర్లు, ప్లానింగ్‌ అధికారులకు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు. కొద్దిరోజుల్లోనే మళ్లీ క్యాంటీన్లు పేదలతో కళకళలాడనున్నాయి.

రాజాం రూరల్‌/ బొబ్బిలి, జూన్‌ 17:

పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో రూ.5కే రుచికరమైన భోజనం అందించే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం 2018లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. చౌక ధరకు అన్నం, సాంబారు, కూర, పెరుగుతో భోజనం పెట్టే అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం బారెడు క్యూలు కనిపించేవి. పేదలు, కార్మికులు, విద్యార్థులు, కూలీలు, భిక్షాటన చేసేవారు ఇలా అన్ని వర్గాలూ కడుపు నిండా అన్నం తినేవారు. అలాంటి క్యాంటీన్లను 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ ఆపేశారు. కొన్నిచోట్ల భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించగా మరికొన్ని చోట్ల నిరుపయోగంగా వదిలేశారు. ఈ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇలాంటి అనేక నిర్ణయాలకు ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో చెక్‌ పెట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఎంతో ప్రజాధరణ ఉన్న అన్న క్యాంటీన్లను పునరుద్ధరించేందుకు నడుంబిగించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే అన్న క్యాంటీన్లు తిరిగి తీసుకొచ్చే ఫైల్‌పై సంతకం చేశారు.

- రాజాంలోని అన్న క్యాంటీన్‌ భవనాన్ని మున్సిపల్‌ అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్‌లకు మంగళం పాడడంతో ఇక్కడి మెయిన్‌రోడ్‌లోని (ప్రస్తుత ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం) క్యాంటీన్‌ నిర్వహించే భవనం ఖాళీగా ఉండడంతో మున్సిపల్‌ అఽధికారులు కాస్త మార్పులు చేర్పులు చేసి ప్రజారోగ్యశాఖ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తిరిగి ఇదే భవనంలో అన్న క్యాంటీన్‌ నిర్వహించే అవకాశాలున్నాయి. కాగా బొబ్బిలిలో ప్రస్తుత ఎమ్మెల్యే బేబీనాయన కొన్నాళ్లుగా తన సొంత నిధులతో అన్న క్యాంటీన్‌ పేరిట అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు. రామభద్రపురంలో సైతం వారానికో రోజు రైతుల ఆకలి తీర్చుతున్నారు. ఎస్‌.కోటలో కూడా చాలా రోజులు కోళ్ల లలితకుమారి అన్న క్యాంటీన్‌ నిర్వహించారు. కొద్దిరోజుల్లో జిల్లా అంతటా నిర్దేశిత ప్రాంతాల్లో తిరిగి అన్న క్యాంటీన్ల తలుపులు తెరుచుకోనున్నాయి.

- విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు నగర పరిధిలోని అన్న క్యాంటీన్లను సిద్ధం చేసే పనిలో పడ్డారు. నగరపాలక సంస్థ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట ఉన్న వీటిని శుక్రవారం పరిశీలించారు. ప్రస్తుతం క్యాంటీన్ల పరిస్థితి ఏమిటి? సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని రోజుల్లో వీటిని ప్రారంభించ వచ్చు తదితర అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. కాగా జిల్లా కేంద్రంలో 2018 జూలై 11న పండగ వాతావరణంలో అప్పటి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరంలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అన్నం, కూరలు వడ్డించి అనంతరం భోజనం కూడా చేశారు.

Updated Date - Jun 17 , 2024 | 11:41 PM