Share News

జేఏసీగా ఏర్పడి పోరాటం ఉధృతం చేయండి

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:53 PM

జేఎస్‌ఎల్‌ కర్మాగారంలో ఉన్న కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు టీవీ రమణ పిలుపునిచ్చారు. ఫెర్రో ఎల్లాయస్‌ కర్మాగారాలకు సంబంధించి విద్యుత్‌ చార్జీలను పెంచుతామని ప్రభుత్వం తెలపగానే యాజమాన్యాలంతా ఒక్కటై కర్మాగారాలను మూసేస్తామని అల్టిమేటం ఇచ్చాయని తెలిపారు. బుధవారం జేఎస్‌ఎల్‌ కర్మాగారం ఎదుట కార్మికులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యాజమాన్యాలకు నష్టం వచ్చే విధంగా నిర్ణయాలు ఉంటే ఒక్కటవుతున్నప్పుడు, ఒక కర్మాగారంలో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు మిగిలిన కర్మాగారాల్లో కార్మికులు ఎందుకు ఒక్కటి కాకూడదని ప్రశ్నించారు. కర్మాగారానికి చెందిన టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షుడు పిల్లా అప్పలరాజు మాట్లాడుతూ కార్మికులందరికీ లే ఆఫ్‌ విషయమై గురువారం వరకు యాజమాన్యానికి సమయం ఇచ్చామని, యాజమాన్యం ఎటూ తేల్చక పోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్య క్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు, జేఎస్‌ఎల్‌ కర్మాగారానికి చెందిన సీఐటీయూ నాయకుడు నమ్మిచినబాబు, బాలిబోని ఈశ్వరరావు, టీఎన్‌టీయూసీ నాయకులు బూసాల అప్పారావు, సలాది బీమయ్య, వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు లగుడు వామాలు పాల్గొన్నారు.

 జేఏసీగా ఏర్పడి పోరాటం ఉధృతం చేయండి
మాట్లాడుతున్న సూర్యనారాయణ:

కొత్తవలస: జేఎస్‌ఎల్‌ కర్మాగారంలో ఉన్న కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి పోరాటాన్ని ఉధృతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా నాయకుడు టీవీ రమణ పిలుపునిచ్చారు. ఫెర్రో ఎల్లాయస్‌ కర్మాగారాలకు సంబంధించి విద్యుత్‌ చార్జీలను పెంచుతామని ప్రభుత్వం తెలపగానే యాజమాన్యాలంతా ఒక్కటై కర్మాగారాలను మూసేస్తామని అల్టిమేటం ఇచ్చాయని తెలిపారు. బుధవారం జేఎస్‌ఎల్‌ కర్మాగారం ఎదుట కార్మికులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ యాజమాన్యాలకు నష్టం వచ్చే విధంగా నిర్ణయాలు ఉంటే ఒక్కటవుతున్నప్పుడు, ఒక కర్మాగారంలో కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు మిగిలిన కర్మాగారాల్లో కార్మికులు ఎందుకు ఒక్కటి కాకూడదని ప్రశ్నించారు. కర్మాగారానికి చెందిన టీఎన్‌టీయూసీ కార్మిక సంఘం అధ్యక్షుడు పిల్లా అప్పలరాజు మాట్లాడుతూ కార్మికులందరికీ లే ఆఫ్‌ విషయమై గురువారం వరకు యాజమాన్యానికి సమయం ఇచ్చామని, యాజమాన్యం ఎటూ తేల్చక పోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్య క్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాడి అప్పారావు, జేఎస్‌ఎల్‌ కర్మాగారానికి చెందిన సీఐటీయూ నాయకుడు నమ్మిచినబాబు, బాలిబోని ఈశ్వరరావు, టీఎన్‌టీయూసీ నాయకులు బూసాల అప్పారావు, సలాది బీమయ్య, వైసీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకుడు లగుడు వామాలు పాల్గొన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:53 PM