Share News

వారం రోజులుగా..

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:17 PM

డివిజన్‌ కేంద్రం పాలకొండలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజి స్ర్టేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో క్రయ, విక్రయాలు కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వారం రోజులుగా..
పాలకొండలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

సాంకేతిక సమస్యే కారణమంటున్న సిబ్బంది

క్రయ, విక్రయ దారులకు తప్పని అవస్థలు

పాలకొండ: డివిజన్‌ కేంద్రం పాలకొండలోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజి స్ర్టేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో క్రయ, విక్రయాలు కోసం వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా సాంకేతిక సమస్యతో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ నిలిచిపోయినట్టు సబ్‌రిజి స్ర్టార్‌ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి. అత్యధికులు భూములు, స్థలాలు, భవనాలు, ఇతర వాణిజ్య సముదాలయాల అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించి ఈ సమయంలోనే రిజిస్ర్టేషన్‌ చేసుకొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రోజూ సరాసరి 20 నుంచి 30 డాక్యుమెంట్లు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే సాంకేతిక సమస్యతో రిజిస్ర్టేషన్‌ ప్ర క్రియ ముందుకు సాగడం లేదు. చేసేది లేక కొంతమంది వేరే ప్రాంతాల్లో ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలను సంప్రదించి రిజిస్ర్టేషన్‌ తంతును చేపడుతున్నారు. మరికొంతమంది వేరే ప్రాంతాలకు వెళ్లలేక స్థానిక కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ఏదేమైనా సర్వర్‌ సమస్య వారం రోజులుగా ఉన్నప్పటికీ దాన్ని రిజిస్ర్టార్‌ శాఖ పరిష్కరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియకు సాంకేతిక సమస్య ఎదురవుతుంది. ప్రధానంగా చలానా స్కాన్‌ చేసే సమయంలో సేవ్‌ కావడం లేదు. దీంతో డాక్యుమెంట్‌ ప్రక్రియను కొనసాగించలేకపోతున్నాం. ఈ విషయమై విజయవాడలోని ఐజీ కార్యాలయానికి సమాచారం అందించాం. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం.

- సత్యనారాయణమూర్తి, సబ్‌ రిజిస్ర్టార్‌

Updated Date - Apr 26 , 2024 | 11:17 PM