Share News

ఎన్నికల నిబంధనలు పాటించండి

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:12 AM

ఎన్నికల విధులలో ఉన్నవారు ఎన్నికల కమిషన్‌, జిల్లా ఎన్నికల విభాగం నుంచి వచ్చే ప్రతి పత్రం క్షుణ్ణంగా చదవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు.

ఎన్నికల నిబంధనలు పాటించండి

కలెక్టరేట్‌: ఎన్నికల విధులలో ఉన్నవారు ఎన్నికల కమిషన్‌, జిల్లా ఎన్నికల విభాగం నుంచి వచ్చే ప్రతి పత్రం క్షుణ్ణంగా చదవాలని కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. ప్రధానంగా ఐటీకి సంబంధించి ఎవరి లాగిన్‌, యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లు వారే స్వయంగా నిర్వహించాలని సూచించారు. బీఎల్‌వో లాగిన్‌లో ఉన్న సమాచారం, పాస్‌వర్డ్‌లు ఎవరికీ ఇవ్వరాదని చెప్పారు. సవరణల కోసం వచ్చిన దరఖాస్తులు గడువులోగా పరిష్కరించాలని ఆదేశించా రు. పేదలందరికీ ఇళ్ల రిజిష్ర్టేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు

Updated Date - Feb 03 , 2024 | 12:12 AM