Share News

హైరిస్క్‌ గర్భిణులపై దృష్టి సారించాలి

ABN , Publish Date - Nov 13 , 2024 | 12:08 AM

జిల్లాలోని హైరి స్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వి.కరుణ అన్నారు.

హైరిస్క్‌ గర్భిణులపై దృష్టి సారించాలి
గర్భిణులతో మాట్లాడుతున్న కమిషనర్‌ కరుణ

బెలగాం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని హైరి స్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వి.కరుణ అన్నారు. జిల్లాలోని రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవా రం పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రితో పాటు బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంసీహెచ్‌, ట్రైబుల్‌ సెల్‌లో రోగుల వివరాల రికార్డును పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు బాగున్నాయని, మరింత మెరు గైన వైద్యం అందించేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. డీఎంహెచ్‌వో విజయపార్వతి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వాగ్దేవి, వైద్య ఆరోగ్య శాఖ నోడల్‌ అఽధికారి డా.వినోద్‌ పాల్గొన్నారు.

సమస్యలపై అధికారులకు తెలియజేస్తా..

సాలూరు, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వైటీసీలో నిర్వహిస్తున్న గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వి.కరుణ మంగళవారం సందర్శించారు. గర్భిణులతో మాట్లా డి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సిబ్బం ది.. ఇక్కడ చాలా మందికి జీతాలు లేవని, డైట్‌ చార్జీలు అం దటం లేదని, కేవలం రూ.120తో గర్భిణికి పౌష్టికాహారం పెట్టడం ఎలా సాధ్యమని తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ విషయాలను పూర్తి స్థాయిలో ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని ఆమె తెలిపారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో కె.విజ యపార్వతి, నోడల్‌ అధికారి వినోద్‌, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్‌ అప్పారావు, నీడ్‌ వేణుగోపా లరావు పాల్గొన్నారు.

108 సేవలపై ఫిర్యాదు

పార్వతీపురం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 108 అంబులెన్స్‌లు సకాలంలో రావడం లేదని, దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కరుణకు పలువురు పీహెచ్‌సీ వైద్యులు ఫిర్యాదు చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా జరిగిన సమావేశంలో వైద్యులు స్వయంగా ఫిర్యాదు చేశారు. 108 అంబులెన్స్‌ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవల్లో జాప్యం జరిగితే సహించేది లేదని కమిషనర్‌ హెచ్చరించారు. ఇకపై ఇటువంటి ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌లో లోపాలు సవరించండి

ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఉన్న లోపాలను సవరించాలని ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్‌ కిషోర్‌ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం హెల్త్‌ కమిషనర్‌ కరుణకు వినతిపత్రం అందించారు. ఫేషియల్‌ రికాగ్నైజేషన్‌ సిస్టం వ్యతిరేకం కాదని, కానీ అందులో లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబరు నెలలో జీతాలు కోల్పోయి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు జీతాలను చెల్లించాలని కోరారు. కమిషనర్‌ స్పందిస్తూ ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.

Updated Date - Nov 13 , 2024 | 12:08 AM