Share News

రక్తహీనతపై దృష్టి సారించాలి: ఎంపీడీవో

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:15 AM

రక్తహీతనపై గ్రామస్థాయిలో వైద్య సిబ్బందితో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఎంపీడీవో పి.సూర్యనారా యణ తెలిపారు. మంగళ వారం మండలంలోని తోట పల్లి, సంతోషపురం, ఉల్లిభద్ర, తదితర సచివాలయాల్లో పదేళ్లలోపు పిల్లల మరణాల రేటు నివారణ కార్యక్రమంపై వైద్య, మహిళా శిశు సంక్షేమశాఖ సి బ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ, రక్తహీనత నివా రణపై దృష్టి సారించాలన్నారు.సమావేశంలో ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు, పంచాయతీకార్యదర్శులు ఉప్పల పెదకోటేశ్వరరావు, చింతల వెంట కుమిరినాయుడు, సూరు శ్రీనివాసరావు, నీరస రవికుమార్‌ పాల్గొన్నారు.

రక్తహీనతపై  దృష్టి సారించాలి: ఎంపీడీవో

గరుగుబిల్లి: రక్తహీతనపై గ్రామస్థాయిలో వైద్య సిబ్బందితో పాటు మహిళా శిశు సంక్షేమశాఖ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని ఎంపీడీవో పి.సూర్యనారా యణ తెలిపారు. మంగళ వారం మండలంలోని తోట పల్లి, సంతోషపురం, ఉల్లిభద్ర, తదితర సచివాలయాల్లో పదేళ్లలోపు పిల్లల మరణాల రేటు నివారణ కార్యక్రమంపై వైద్య, మహిళా శిశు సంక్షేమశాఖ సి బ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు నివారణ, రక్తహీనత నివా రణపై దృష్టి సారించాలన్నారు.సమావేశంలో ఈవోపీఆర్‌డీ ఎల్‌.గోపాలరావు, పంచాయతీకార్యదర్శులు ఉప్పల పెదకోటేశ్వరరావు, చింతల వెంట కుమిరినాయుడు, సూరు శ్రీనివాసరావు, నీరస రవికుమార్‌ పాల్గొన్నారు.

ఫగుమ్మలక్ష్మీపురం: గిరిజన గ్రామాల చిన్నారుల్లో రక్తహీనత లేకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీఓ జి.జగదీష్‌ కుమార్‌ అన్నారు. మంగళ వారం మండలంలోని డుమ్మంగి, కుక్కిడి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన కన్వర్జెన్సీ సమావేశాల్లో మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖ, శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ కార్యదర్శులు వేసవిలో చిన్నారుల్లో రక్తహీనత సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కోరారు. స్ర్తీ, శిశు సంక్షేమ శాఖకు చెందిన సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఏడాదిలోపు చిన్నారులను దత్తత తీసుకొని వారి బాగోగులు చూడాలన్నారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది, భద్రగిరి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఫసీతానగరం: రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులు ,బాలింతలు గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పేర్లు నమోదు చేయించాలని ఎంపీడీవో ఎం.ఈశ్వరరా వు తెలిపారు. పెదభోగిల సచివాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించా రు కార్యక్రమంలో కేకే కుమార్‌ వర్మ, ఈఓ జి.వెంకటరమణ పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 07:46 AM