Share News

మడ్డువలస రిజర్వాయర్‌లో మత్స్యకారుడి మృతి

ABN , Publish Date - Apr 02 , 2024 | 12:08 AM

వంగర మండలంలోని మడ్డువలస రిజ ర్వాయర్‌కు వేటకు వెళ్లిన అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన మత్స్యకారుడు కొమ్మర దేవుడు (47) పటు వర్దనం సమీపంలో నాటుపడవ బోల్తాపడి మృతిచెందాడు.

మడ్డువలస రిజర్వాయర్‌లో మత్స్యకారుడి మృతి

వంగర: వంగర మండలంలోని మడ్డువలస రిజ ర్వాయర్‌కు వేటకు వెళ్లిన అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన మత్స్యకారుడు కొమ్మర దేవుడు (47) పటు వర్దనం సమీపంలో నాటుపడవ బోల్తాపడి మృతిచెందాడు. పటు వర్దనం గ్రామ స్థులు, పోలీసుల కథనం మేరకు.. రిజర్వాయర్‌లోకి నాటుపడవతో సోమవారం సాయంత్రం దేవుడు వెళ్లాడు. నదిలోకి వెళ్లిన కొద్దిసేపటికే నాటుపడవ గాలు లకు బోల్తాపడింది. దీంతో చేపలకు వేయడానికి సిద్ధంచేసిన వలకు చిక్కుకుని మృతిచెందాడు. వేటకు వెళ్లిన దేవుడు చీకటిపడిన వరకు రాకపోవడంతో కంగారు పడిన భార్య సూకమ్మ గ్రామంలో తోటి మత్య్సకారులకు విషయం తెలియజే సింది. దీంతో నది వద్దకు వెళ్లిన మత్స్యకారులు బోల్తాపడిన బోటు, వలకు చి క్కుకుని ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. అయితే అప్పటికే మృతిచెం దినట్లు గుర్తించారు. దేవుడు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి పొట్టపోషణకు పటువ ర్దనం వచ్చాడు. ఇక్కడ మడ్డువలస రిజర్వాయర్‌లో చేపల వేట సాగించి కు టుంబాన్ని పోషిస్తున్నాడు. దేవుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటిప ర్యాంత మయ్యారు. ఆయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దేవుడు మృతి విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ జనార్దనరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం రాజాం తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు

Updated Date - Apr 02 , 2024 | 12:08 AM