Share News

సింగరాయిలో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:18 AM

మండలంలోని సింగరాయి గ్రామ సమీపంలో గల ఏఎన్నార్‌ లేఅ వుట్‌లో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో చెందనం, మల్బరీ మొక్కలు కాలిపోయాయి.

సింగరాయిలో అగ్ని ప్రమాదం

వేపాడ: మండలంలోని సింగరాయి గ్రామ సమీపంలో గల ఏఎన్నార్‌ లేఅ వుట్‌లో సోమవారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో చెందనం, మల్బరీ మొక్కలు కాలిపోయాయి. ఎస్‌.కోట అగ్నిమాపక అధికారి మదీన తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మంగళవారం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రామలక్ష్మి, అగ్నిమాపక అధికారి మదీన ఘటనా స్థలానికి చేరుకుని నష్ట వివరాలను సేకరించారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:18 AM