Share News

కాలువల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:45 PM

పాలిథిన్‌ కవర్లు, దుకాణాల్లో వ్యర్థాలను కాలువల్లో వేస్తున్నట్లు గుర్తించామని, అటువంటి చర్యలు మానుకోకపోతే జరిమానాలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం. మల్లయ్యనాయుడు హెచ్చరించారు. బుధవారం విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో పూడికతీత పనులను నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు పరిశీలించారు. సర్కిళ్ల వారీగా పనుల తీరును గమనించి, అవసరమైన సలహాలు, సూచనలిచ్చారు. కేఎల్‌పురం, కంటోన్మెంట్‌, కణపాక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రధాన కాలువల్లో వర్షపు నీరు సజావుగా ప్రవహించే విధంగా ఉండాలన్నారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

 కాలువల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా

విజయనగరం రింగురోడ్డు: పాలిథిన్‌ కవర్లు, దుకాణాల్లో వ్యర్థాలను కాలువల్లో వేస్తున్నట్లు గుర్తించామని, అటువంటి చర్యలు మానుకోకపోతే జరిమానాలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం. మల్లయ్యనాయుడు హెచ్చరించారు. బుధవారం విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో పూడికతీత పనులను నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎం.మల్లయ్యనాయుడు పరిశీలించారు. సర్కిళ్ల వారీగా పనుల తీరును గమనించి, అవసరమైన సలహాలు, సూచనలిచ్చారు. కేఎల్‌పురం, కంటోన్మెంట్‌, కణపాక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రధాన కాలువల్లో వర్షపు నీరు సజావుగా ప్రవహించే విధంగా ఉండాలన్నారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేసి, చెత్తాచెదారం తొలగించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

Updated Date - Jun 12 , 2024 | 11:45 PM