Share News

నవధాన్యాలతో భూసారం: ఏవో

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:49 PM

రైతులు నవధాన్యాలను సాగుచేస్తే భూముల మరింత సారవంతంగామారి దిగుబడులు పెరుగుతాయని ఏవో రవీంద్ర తెలి పారు. శనివారం మండలంలోని సంతగైరమ్మపేట ఆర్బీకేలో వీఏఏ రవి చంద్ర ఆధ్వర్యంలో రైతులకు నవధాన్యాల కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసా య సిబ్బంది ఎంటీ కోటి, మల్లేష్‌ నాయుడు, చరణ పాల్గొన్నారు.

  నవధాన్యాలతో భూసారం: ఏవో

శృంగవరపుకోట రూరల్‌: రైతులు నవధాన్యాలను సాగుచేస్తే భూముల మరింత సారవంతంగామారి దిగుబడులు పెరుగుతాయని ఏవో రవీంద్ర తెలి పారు. శనివారం మండలంలోని సంతగైరమ్మపేట ఆర్బీకేలో వీఏఏ రవి చంద్ర ఆధ్వర్యంలో రైతులకు నవధాన్యాల కిట్లు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసా య సిబ్బంది ఎంటీ కోటి, మల్లేష్‌ నాయుడు, చరణ పాల్గొన్నారు.

వంద టన్నుల వరి విత్తనాలు సిద్ధం

లక్కవరపుకోట: మండలంలోని రైతులకు వంద టన్నుల వరి విత్తనాలు పంపిణీకి సిద్ధం చేసినట్లు ఏవో ఎం.స్వాతి తెలిపారు. 23 ఆర్బీకేలకు గాను 16 ఆర్బీకేలకు విత్తనాలు పంపించామని పేర్కొన్నారు.1121 రకం విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, సోమవారం నుంచి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రైతుల డిమాండ్‌ను బట్టిమిగతా రకాలు తీసుకొస్తామని పేర్కొన్నారు. ముందుగా పచ్చిరొట్ట ఎరువులు పంపిణీ చేస్తున్నామని, 50 శాతం రాయితీతో జీలుగ, పిల్లిపెసర, కట్టెజనుము విత్తనాలుఅందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 11:49 PM