Share News

ఖైదీలకు సౌకర్యాలు కల్పించాలి

ABN , Publish Date - May 26 , 2024 | 12:14 AM

ఎండల దృష్ట్యా సబ్‌ జైలు రిమాండ్‌ ఖైదీలకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, పాలకొండ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.విజయరాజ్‌కుమార్‌ సూచిం చారు.

 ఖైదీలకు సౌకర్యాలు కల్పించాలి

పాలకొండ: ఎండల దృష్ట్యా సబ్‌ జైలు రిమాండ్‌ ఖైదీలకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌, పాలకొండ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎ.విజయరాజ్‌కుమార్‌ సూచిం చారు. శనివారం పాలకొండ సబ్‌జైలును బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి ఆ యన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిమాండ్‌ ఖైదీలతో మాట్లాడా రు. ‘మీరంతా బెయిల్‌ కోసం లాయర్స్‌ను సంప్రదించారా.. లేదా’ అని ప్రశ్నించారు. అనంతరం జైలులో ఉన్న స్నానపు గదులు, వంటశాల, స్టాక్‌రూమ్‌ను పరిశీలిం చారు. ఖైదీలకు రోజువారి మెనూ ప్రకారం వేడి పదార్థాలు అందించాలన్నారు. ఆ యన వెంట హెడ్‌వార్డర్‌ బి.విజయకుమార్‌, బార్‌ అసోసియేషన్‌ సభ్యులు పి.ము నిస్వామి, ఎం.వెంకటేశ్వరరావు, జైలు వార్డర్లు పి.మధు, నరసింహులు ఉన్నారు.

రాజీతోనే రాజమార్గం

పాలకొండ: పాలకొండ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో ఉన్న అన్ని పోలీ స్‌స్టేషన్లలో వివిధ రకాల కేసులకు సంబంధించి ఫిర్యాదుదారులను, ప్రతివాదులను పిలిపించి రాజీ కుదుర్చుకునేలా వారికి సూచించాలని జూనియర్‌ సివిల్‌ న్యాయా ధికారి ఏ.విజయరాజ్‌కుమార్‌ తెలిపారు. సబ్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కోర్టు ప్రాంగణంలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, దోనుబాయి, వంగర తదిత ర పోలీస్‌స్టేషన్ల ఎస్‌ఐలతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. రానున్న లోక్‌అదాలత్‌లో అధిక మొత్తం రాజీమార్గం ద్వారా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులు పరిష్కరించాలని సూచించారు. కొన్ని సంవత్సరాలుగా కోర్టులో ఉన్న కేసుల పై దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఎస్‌ఐ ఎన్‌.ప్రశాంత్‌కుమార్‌, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, దోనుబాయి, వంగర తదితర పోలీస్‌స్టేషన్ల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:14 AM