Share News

పాఠశాలల సెలవులు పొడిగింపు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:04 PM

పాఠశాలల సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

పాఠశాలల సెలవులు పొడిగింపు

సాలూరు రూరల్‌,జనవరి 17: పాఠశాలల సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ సురేష్‌కుమార్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 19, 20 తేదీల వరకు సెలవులు పొడిగించగా, 21న ఆదివారం పబ్లిక్‌ హాలీడే కావడంతో 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. సెలవుల పొడిగింపు ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు వర్తించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు 1720 వరకు ఉన్నాయి. వాటిన్నింటికి ఈ ఉత్తర్వులు వర్తించనున్నాయి.

పరిహార సెలవులు సరికాదు: ఆపస్‌

ఆకస్మికంగా సంక్రాంతి సెలవులను పొడిగించి.. భవిష్యత్‌లో పబ్లిక్‌ హాలీడేస్‌లో పని చేయాలని ఆదేశించడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఆపస్‌) జిల్లా ప్రధాన కార్యదర్శి నాలి చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సెలవుల పొడిగింపు ఉపసహరించాలన్నారు. ఈ నెల 22న సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆరోజున సెలవు ప్రకటించా యన్నారు. ఏపీ ప్రభుత్వం సెలవు పెట్టుకునే వీల్లేకుండా చేయడం తగదన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:04 PM