Share News

ప్రభుత్వ దుర్మార్గాలను వివరించండి

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:43 AM

వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి.. పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు.

ప్రభుత్వ దుర్మార్గాలను వివరించండి

సాలూరు: వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణి.. పార్టీ శ్రేణులకు పిలపునిచ్చారు. శుక్రవారం సాలూరులోని తన నివాసంలో ఆమె టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ కిట్లను పార్టీ శ్రేణులకు అందజేశారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి తమ పార్టీ లక్ష్యాలను ప్రజలకు తెలియజేయాలని.. ప్రభుత్వ దుర్మార్గాలను వివరించాలని శ్రేణులను కోరారు. శంఖారావం సభకు పెద్ద సంఖ్యలో హాజరైన టీడీపీ- జనసేన కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

లోకేశ్‌ మాటల్లో తప్పేంటి?

టీడీపీ యువ నేత లోకేశ్‌ నిర్వహించిన శంఖారావంలో ఉప ముఖ్యమం త్రి పీడిక రాజన్నదొరను ఇంకు లేని పెన్ను అన్న మాటల్లో తప్పేంటని ప్రశ్నించారు. ప్రతి చిన్న విషయానికీ చిన్న శ్రీను వద్దకు పంపుతారని తెలిపారు. ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తనపై కేసు పెట్టుకోండి అంటూ సవాల్‌ విసిరారు. ‘మాట్లాడితే చర్చకు రండి అని పిలుస్తారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న మీరు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాల’ని డిమాండ్‌ చేశారు. గిరిజన మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరు ఐటీడీఏ సర్వసభ్య సమావేశం ఎన్నిసార్లు నిర్వహించారని ప్రశ్నించారు. గిరిజనుల పిల్లల బడులను మూసేస్తే ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని నిలదీశారు. 18 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు మన వీధుల్లోకి నీరు వస్తే ఆపలేకపోయారెందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మంత్రి అనుచరులే డబ్బులు వసూలు చేస్తుంటే ఎలాంటి చర్యలు లేవని ఆరోపించారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని... త్వరలో బయట పెడతానని అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో క్రికెట్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి పొందిన పాచిపెంట టీంను ఇంటికి పంపిం చేసి... అర్హత లేని పార్వతీపురం జట్టును ఎందుకు రాష్ట్ర స్థాయికి పంపించారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్య క్షుడు నిమ్మాది తిరుపతిరావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:43 AM