Share News

ఆ రెండింటిపై ఉత్కంఠ

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:21 PM

చంద్రంపేట (బూత్‌ 223), రామవరంలో (బూత్‌ 232)ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 13న పోలింగ్‌ రోజున ఈ రెండు బూత్‌ల్లో మాక్‌ పోలింగ్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు.

ఆ రెండింటిపై ఉత్కంఠ

ఆ రెండింటిపై ఉత్కంఠ

మాక్‌పోల్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంలో ఓటింగ్‌

గంట్యాడ, జూన్‌ 3: చంద్రంపేట (బూత్‌ 223), రామవరంలో (బూత్‌ 232)ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ నెలకొంది. గత నెల 13న పోలింగ్‌ రోజున ఈ రెండు బూత్‌ల్లో మాక్‌ పోలింగ్‌ క్లియర్‌ చేయకుండా ఈవీఎంల్లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. చంద్రంపేట గ్రామంలో మొత్తం 883 మంది ఓటర్లు ఉండగా 739 ఓట్లు పోలయ్యాయి. ఈ బూత్‌లో పార్లమెంట్‌ స్థానానికి సీఆర్‌సీ(మాక్‌ పోలింగ్‌ క్లియర్‌) చేశారు కాని అసెంబ్లీ స్థానానికి సీఆర్‌సీ చేయనట్లు అధికారులు వెల్లడించారు. ఇక రామవరంలోని బూత్‌ నెంబరు 232లో అసెంబ్లీ, పార్లమెంట్‌ రెండు స్థానాలకూ సీఆర్‌సి చేయకుండా ఓటింగ్‌ మొదలు పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బూత్‌లో 970 ఓట్లు ఉండగా 861 ఓట్లు పోలయ్యాయి. మంగళవారం జరగనున్న ఓట్ల లెక్కింపు సమయంలో ఈ రెండు బూత్‌లు మిగిలిన బూత్‌ల ప్రకారం లెక్కించడానికి అవకాశం లేనట్లు తెలుస్తోంది. బరిలో దిగిన అభ్యర్థులు ఎవరికైనా ఈ రెండు బూత్‌ల ఓట్లతో సంబంధం లేకుండా అత్యధిక మెజార్టీతో గెలిస్తే వీటి కౌంటింగ్‌ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

------------------

Updated Date - Jun 03 , 2024 | 11:21 PM