టెన్త్ పరీక్ష కేంద్రాల పరిశీలన
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:15 PM
జిల్లాలో పార్వతీపురంతో పాటు పలు ప్రాంతాల్లో టెన్త్ పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన సెంటర్లను శుక్రవారం పదో తరగతి పరీక్షల సంచాలకుడు డి.దేవానంద్‌రెడ్డి పరిశీలించారు.

పార్వతీపురం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్వతీపురంతో పాటు పలు ప్రాంతాల్లో టెన్త్ పరీక్ష కేంద్రాలు, మూల్యాంకన సెంటర్లను శుక్రవారం పదో తరగతి పరీక్షల సంచాలకుడు డి.దేవానంద్‌రెడ్డి పరిశీలించారు. మౌలిక వసతులు, ఇతరత్రా సౌకర్యాలపై ఆరా తీశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు ఉండ రాదన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లపై సిబ్బంది తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్, పరీక్షల సహాయ కమిషనర్ తదితరులు ఉన్నారు.