Share News

ఎస్మాకు భయపడేది లేదు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:05 AM

ఎస్మాకు భయపడేది లేదని, తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాడుతామని అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు.

ఎస్మాకు భయపడేది లేదు
ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

- సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం

- 27వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

విజయనగరం(ఆంధ్రజ్యోతి) జనవరి 7: ఎస్మాకు భయపడేది లేదని, తమ సమస్యలను పరిష్కరించే వరకూ పోరాడుతామని అంగన్‌వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 27వ రోజు ఆదివారం కూడా సమ్మెను కొనసాగించారు. వీరికి పలు ప్రజా సంఘాల నాయకులు, జనసేన నాయకురాలు పాలవలస యశస్వీ తదితరులు మద్దతు ప్రకటించారు. ఇన్సూరెన్స్‌ యూనియన్‌ నాయకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి, హక్కుల కోసం ఉద్యమాలు చేసేవారికి ఎస్మా చట్టం కొత్తమేకాదని అన్నారు. న్యాయమైన సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన చేపడితే ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, సిఐటీయూ నాయకుడు టీవీ రమణ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు వెంకటేష్‌, సౌమ్య, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:05 AM