ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 28 , 2024 | 12:24 AM
గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు.

సీతంపేట రూరల్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి):గిరిజన గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు. సీతంపేటలోని ఐటీడీఏ కార్యాలయ ప్రధాన గేటు వద్ద ఎనిమిది రోజులుగా ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని బుధవారం ఆయనతోపాటు ఏపీటీఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్షుడు దుర్గారావు, పాలకొండ మండలఅధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వాసు,సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణదొర సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ మన్యం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మహేష్, నల్ల బాలకృష్ణ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులను గిరిజనవిద్యాశాఖలోకి విలీనం చేసి,వారి సర్వీసును క్రమబద్దీకరించా లని డిమాండ్ చేశారు. కార్య క్రమంలో ఏజేఏసీ నాయకులు బి. శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరరావు, రామ్మోహనరావు, ఉద్యోగులు బి గణేష్,మోహనరావు పాల్గొన్నారు.