Share News

కదలని ఏనుగులు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:23 AM

జియ్యమ్మవలస మం డలం నుంచి గజరాజు లు కదలడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరి స్తున్న ఏనుగులు స్థానికులను భయాం దోళనకు గురి చేస్తు న్నాయి.

 కదలని ఏనుగులు

జియ్యమ్మవలస: జియ్యమ్మవలస మం డలం నుంచి గజరాజు లు కదలడం లేదు. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలోనే సంచరి స్తున్న ఏనుగులు స్థానికులను భయాం దోళనకు గురి చేస్తు న్నాయి. ప్రస్తుతం అవి సుభద్రమ్మవల సలో తిష్ఠ వేశాయి. మంగళవారం రాత్రి కన్నపుదొరవలసలోనే ఉన్న ఏనుగుల గుంపు బుధవారం సుభద్రమ్మవలస మీదుగా నిర్వాసిత గ్రామమైన బిత్రపాడు నుంచి బట్లభద్ర గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ నుంచి మళ్లీ సభద్రమ్మవలస పక్కనే ఉన్న అరటి, పామాయిల్‌ పొలాల్లో చేరాయి. దీంతో రైతులు ఆందోళన చెందు తున్నా రు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ఏనుగులు పూర్తిస్థాయిలో ధ్వం సం చేస్తుండగా.. అంతంతమాత్రంగానే మంజూరయ్యే నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీశాఖాధి కారులు స్పందించి ఏనుగులను ఇక్కడ నుంచి శ్వాతంగా తరలిం చేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:23 AM