Share News

రహదారిపై ఏనుగులు

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:56 PM

మండలంలో పెదమేరంగి కూడలి - గంగమ్మపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఏనుగులు సంచరించాయి. దీంతో వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు.

రహదారిపై ఏనుగులు
పెదమేరంగి ప్రధాన రహదారి పక్కన చెట్టు నీడలో ఉన్న ఏనుగులు

జియ్యమ్మవలస, మార్చి 22 : మండలంలో పెదమేరంగి కూడలి - గంగమ్మపేట గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై శుక్రవారం ఏనుగులు సంచరించాయి. దీంతో వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోయారు. గజరాజులు ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన చెందారు. కాగా ఉదయం బిత్రపాడు, సీమనాయుడువలస గ్రామాల మధ్య సంచరించిన ఏనుగులు సాయంత్రానికి పెదమేరంగి కూడలికి సమీపంలో రోడ్డుపై దర్శనమిచ్చాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొద్దిసేపటి తర్వాత అవి పొలాల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. యథావిఽధిగా రాకపోకలు సాగించారు. కాగా దీనిపై అటవీశాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:56 PM