Share News

తాలాడలో ఏనుగులు

ABN , Publish Date - May 03 , 2024 | 11:29 PM

భామిని మండలం తాలాడ సమీపంలో గత రెండురోజులుగా గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా అవి గ్రామ సమీపానికి చేర డంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందారు.

తాలాడలో ఏనుగులు
తాలాడ గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగులు

భామిని: భామిని మండలం తాలాడ సమీపంలో గత రెండురోజులుగా గజరాజులు హల్‌చల్‌ చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఏకంగా అవి గ్రామ సమీపానికి చేర డంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళన చెందారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని హడలెత్తిపోయారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు సాహసించలేకపోయారు. ఇన్నాళ్లు పల్లెల శివార్లలో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసిన గజరాజులు ఇలా గ్రామ సమీపంలోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని టెన్షన్‌ పడుతున్నారు. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించకముందే సంబంధిత అధికారులు స్పందించి వాటిని ఈ ప్రాంతం నుంచే తరలించే చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్తూరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కృష్ణారావుతో పాటు పది మంది ట్రాకర్స్‌ ఏనుగుల సంచారంపై నిఘా వేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 11:29 PM