Share News

పెదబొండపల్లిలో ఏనుగుల సంచారం

ABN , Publish Date - Oct 21 , 2024 | 12:15 AM

మండలంలోని పెదబొండపల్లి శివా రులో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

పెదబొండపల్లిలో ఏనుగుల సంచారం

పార్వతీపురం రూరల్‌, అక్టోబరు 20(ఆంధ్ర జ్యోతి): మండలంలోని పెదబొండపల్లి శివా రులో ఏనుగులు సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రూరల్‌ ఎస్‌.సంతోషి కుమారి ఏనుగుల సంచరి స్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఏనుగుల వల్ల ఎటువంటి హాని జరగకుండా అటవీశాఖతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు సహకరించాలని కోరారు. కొద్దిరోజులుగా మండలంలోనే ఏనుగులు తిష్ఠ వేయడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ సంతోషికుమారి: బెలంగం 3

Updated Date - Oct 21 , 2024 | 12:15 AM