ఈదురు గాలలకు నేలకొరిగిన విద్యుత్ స్తంభం
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:34 AM
ఈదురు గాలులు ఉరుములు మెరు పులతో కుర్షిన భారీ వర్షా నికి అగ్నిమాపక కేంద్రం వెనుక భాగంలో టేకు చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

రాజాం: ఈదురు గాలులు ఉరుములు మెరు పులతో కుర్షిన భారీ వర్షా నికి అగ్నిమాపక కేంద్రం వెనుక భాగంలో టేకు చెట్టు విద్యుత్ స్తంభంపై విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలు సుకున్న విద్యుత్ సిబ్బంది హుటాహుటిన చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టారు. దీని కారణంగా పురపాలక సంఘం పరిధిలోని వస్త్రపురికాలనీకి మాత్రమే విద్యుత్ సరఫరా ఉండదని ఏడీ తెలిపారు. లైన్ ఇన్స్‌పెక్టర్ రమణమూర్తి ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకుని కాలనీవాసులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా పుణరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.