Share News

ఎన్నికల నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:05 AM

వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధిగా పాటించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎల్‌.జోషప్‌ సూచించారు.

ఎన్నికల నిబంధనలు పాటించాలి

రాజాం: వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల కమిషన్‌ నిబంధనలు విధిగా పాటించాలని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎల్‌.జోషప్‌ సూచించారు. పార్టీ సమావేశాలు ఏర్పాటు చేసినా, మైక్‌సెట్‌ ద్వారా ప్రచారం నిర్వహించినా, మందుగా దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లో అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిం చి కార్యక్రమాలు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ విషయంలో అన్ని పార్టీల నాయకులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. దరఖాస్తు చేయడానికి అవసరమైన ఫారాలు స్థానిక ఎన్నికల డీటీ ప్రకాష్‌ వద్దనే అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎస్‌.కృష్ణంరాజు, డీటీ ప్రకాష్‌, నాయకులు గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, పొగిరి మంగరాజు, మిత్తిరెడ్డి మదుసుధనరావు, వంజరాపు నర్శింహనాయుడు పాల్గొన్నారు.

కోడ్‌ అమలుపై శిక్షణ

బొండపల్లి: స్థానిక మండల పరిషత్‌ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల కోడ్‌ అమలుపై ఎంపీడీవో ఎస్‌.హరిహరరావు సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పక్కాగా ఎన్నికల కోడ్‌ను అమలు చేయాలన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి, రాజకీయ పార్టీ నాయకుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలన్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలను పరిశీలించి, నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదు చేయాలని చెప్పారు. అనుమతులు లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు, జెండాలు కడితే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ హనుమంతరావు, డిప్యూటీ తహసీల్దార్‌ పి.హరి, ఈవోపీఆర్డీ సుగుణాకరరావు, డిజిటల్‌ సహాయకులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

గ్రామాల్లో పరిశీలన

నెల్లిమర్ల: ఎన్నికల విధుల్లో భాగంగా ఎంపీడీవో జి.రామారావు మండలంలోని కొండగుంపాం, పూతికపేట, గరికిపేట, మొయిద విజయరాంపురం గ్రామాల్లో గురువారం పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. అలాగే మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ అమలు తీరును పరిశీలించారు. స్థానిక వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సింహాద్రి, ఎంపీడీవో కార్యాలయ సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:05 AM