Share News

ఎన్నికల నియమావళిని అమలు చేయాలి

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:49 PM

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే విధిగా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పోలీస్‌ అధికారులతో మాట్లాడారు.

ఎన్నికల నియమావళిని అమలు చేయాలి

పార్వతీపురం, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన వెంటనే విధిగా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, పోలీస్‌ అధికారులతో మాట్లాడారు. ఎటువంటి ఉల్లంఘటనలకు అవకాశం లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయం, ప్రాంగణాల్లో ఉన్న ఫొటోలు, పోస్టర్లు, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రచార సామగ్రి, హోర్డింగ్‌లను కూడా 48 గంటల్లోగా తొలగించాలని సూచించారు. ఎన్నిక నియమావళి ప్రకారం అధికారులు విధులు నిర్వహించాలన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో జేసీ శోభిక, ఇన్‌చార్జి డీఆర్వో జి.కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అరకు పార్లమెంట్‌ టర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌

అరకు పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ నియామకమయ్యారు. ఆయన పర్యవేక్షణలో అరకు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ గురువారం పరిశీలించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడులైన వెంటనే తదుపరి పక్రియ చేపడతామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 14 , 2024 | 11:49 PM