Share News

జిల్లాకు ఎన్నికల పరిశీలకులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:16 PM

ఎలక్షన్‌ కమిషన్‌ నియమించిన ఎన్నికల పరిశీలకులు జిల్లాకేంద్రానికి వచ్చారు. గురువారం వారిని కలెక్టర్‌ నిశాంత్‌నిశాంత్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లాకు ఎన్నికల పరిశీలకులు
కంట్రోల్‌ రూములో ఎన్నికల పరిశీలకులతో కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎలక్షన్‌ కమిషన్‌ నియమించిన ఎన్నికల పరిశీలకులు జిల్లాకేంద్రానికి వచ్చారు. గురువారం వారిని కలెక్టర్‌ నిశాంత్‌నిశాంత్‌కుమార్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు, పటిష్ట నిఘా తదితర అంశాలపై వివరించారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌కుమార్‌ మెహర్డ, నయిం ముస్తఫా మన్సూరీలు కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో ఎన్నికల ప్రవర్తన నియమావళి, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానటరింగ్‌ సెల్‌, మీడియా సెంటర్‌, సోషల్‌ మీడియా విభాగం, వ్యయ విభాగం, జియో టాకింగ్‌ వాహనాల పర్యవేక్ష విభాగాలను పరిశీలించారు. ఆ తర్వాత గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర ఉద్యాన కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఈ పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, ఇన్‌చార్జి డీఆర్వో కేశవనాయుడు, ఎంసీసీ నోడల్‌ అధికారి ఎండీ గయాజుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:16 PM