Share News

ఎన్నికలపై అప్రమత్తం

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:26 PM

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఉల్లిభద్రలో ఉద్యాన కళాశాలను పరిశీలించారు.

 ఎన్నికలపై అప్రమత్తం
ఉద్యాన కళాశాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

గరుగుబిల్లి, జనవరి 8 : సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఉల్లిభద్రలో ఉద్యాన కళాశాలను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రపర్చేందుకు అవసరమైన స్ట్రాంగ్‌ రూములను పరిశీలించారు. కౌంటింగ్‌కు ఈ ప్రాంతం అనుకూలంగా లేదన్న దానిపై అధికారులతో చర్చించారు. ఎన్నికల నిర్వహణ అనంతరం ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాట్లపై సమీక్షించారు. నియోజకవర్గం పరిధిలోని రిటర్నింగ్‌ అధికారులు, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. నిర్వహణపై అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. కళాశాలకు సంబంధించి పలు బ్లాకుల పరిధిలోని గదులను ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ కూడా పరిశీలించారు. పార్వతీపురం ఆర్డీవో కె.హేమలత, డివిజనల్‌ సర్వే అధికారి కె.సూర్యారావు, తహసీల్దార్‌ జనార్దన్‌, కళాశాల అసోసియేట్‌ డీన్‌ ప్రసన్నకుమార్‌, డీటీలు, ఆర్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:26 PM