Share News

ఏకలవ్య ప్రవేశ పరీక్ష వాయిదా

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:34 PM

సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని, మెళియాపుట్టి ఏకలవ్య పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు అన్నదొర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

  ఏకలవ్య ప్రవేశ పరీక్ష వాయిదా

సీతంపేట: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని భామిని, మెళియాపుట్టి ఏకలవ్య పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించాల్సిన పరీక్షను వాయిదా వేసినట్లు జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు అన్నదొర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 6,7,8,9 తరగతిలో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే గురుకుల కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నెల 20న ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న వారు ఈ విషయాన్ని గమ నించాలని సూచించారు. ఈనెల 20న నిర్వహించే పరీక్షకు హాజరుకావాలన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 11:34 PM