పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణానికి కృషి చేస్తా
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:11 AM
నాగావళి నదిపై అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

కొమరాడ: నాగావళి నదిపై అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు- లాబేసు వంతెన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. ఆదివారం ఆమె కొమరాడ మండలంలో పర్యటించారు. గుణదతీలేసు గ్రామ సచివాలయ భవనాన్ని, రైతుభరోసా కేంద్రాన్ని ప్రారంభించా రు. అనంతరం పూర్ణపాడు గ్రామాల మధ్య నిలిచిపోయిన వంతెన పనులను ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో రహదారులు, విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరేష్ చంద్రదేవ్, ఎస్.ఉదయ శేఖర్ పాత్రుడు, జి.సుదర్శనరావు, డి.వెంకటినాయుడు, పి.వెంకటినాయుడు, ఎస్.రామచంద్రపాత్రుడు, మధుసూదనరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మల్లేష్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.