Share News

మలేరియా నియంత్రణకు కృషి చేయాలి: డీఎంవో

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:22 PM

మలేరియా నియంత్రణకు కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు స్పష్టం చేశారు.

మలేరియా నియంత్రణకు కృషి చేయాలి: డీఎంవో
ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మలేరియా అధికారి, వైద్య సిబ్బంది, ఆశాలు

సీతంపేట: మలేరియా నియంత్రణకు కృషి చేయాలని జిల్లా మలేరియా అధికారి (డీఎంవో) డాక్టర్‌ టి.జగన్మోహన్‌రావు స్పష్టం చేశారు. దోనుబాయి పీహెచ్‌సీలో మంగళవారం నిర్వహించిన ఆశాడే కార్యక్రమంలో ఆయన పాల్గొని సమీక్ష జరిపారు. గ్రామాల్లో మలేరియా జ్వరాలు ఏ మేరకు నమోదు అవుతున్నాయి? ఏ విధమైన నియంత్రణ చర్యలు చేపడుతున్నారు? తదితర అంశాలపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. జ్వరాలను సకాలంలో గుర్తించి నిర్ధారణ పరీక్షలు జరపాలని ఆదేశించారు. డ్రైడే కార్యక్రమాలు ప్రతిరోజూ నిర్వహించాలని, దోమల లార్వా నిర్మూలన చర్యలను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టాలని అన్నారు. ఆరోగ్య సమస్యలు గుర్తించడంలో జాప్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మారుమూల గ్రామాల్లో ఉన్న వెల్నెస్‌ కేంద్రాల్లో వైద్య సేవలందించాలని స్పష్టం చేశారు. గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం మలేరియా వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా స్థానికంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. మలేరియా నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్‌ ఎస్‌.భాను ప్రతాప్‌, ఏఎంవో సూర్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి జె.మోహన్‌రావు, కార్యాలయ సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మలేరియా అధికారి, వైద్య సిబ్బంది, ఆశాలు

Updated Date - Jun 11 , 2024 | 11:23 PM