Share News

పాడి సంపదతో ఆర్థికాభివృద్ధి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:31 PM

పాడి సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

పాడి సంపదతో ఆర్థికాభివృద్ధి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

బెలగాం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పాడి సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చునని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అఖిల భారత పశుగణన కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పశు సంపదపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా సంబంధిత అధికారులు కృషి చేయాలని అన్నారు. పశు గణనను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. వచ్చే ఫిబ్రవరి 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జిల్లాలో ప్రతీ ఇంటిని సందర్శించి పశువుల సమగ్ర సమాచారాన్ని సేకరించాలన్నారు. పశు సంపదను ప్రోత్సహిస్తూ, వాటి ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యశాఖ అధికారి డా.ఎస్‌.మన్మథరావు, వైద్యులు ఎం.ప్రసాద్‌, దీనకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:31 PM