Share News

అకాల వర్షాలతో అన్నదాతలకు అవస్థలు

ABN , Publish Date - May 15 , 2024 | 11:21 PM

అకాలవర్షాలు అన్నదాతలను అగచాట్లకు గురిచేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న తదితర పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన మొక్కజొన్న కంకులు తడిసిపోవడంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. మొక్కజొన్న పంటకల్లాల్లోనే ఉండిపోవడంతో పంటసాగుకు చేసిన అప్పులు చెల్లించేందుకు, ఇతర ఆర్థిక అవసరాలకు రైతులు ఇబ్బందిపడుతున్నారు.

అకాల వర్షాలతో అన్నదాతలకు అవస్థలు
పురిటిపెంటలో ఎండబెట్టిన మొక్కజొన్న కంకులు:

గజపతినగరం

అకాలవర్షాలు అన్నదాతలను అగచాట్లకు గురిచేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న తదితర పంటలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి వచ్చిన మొక్కజొన్న కంకులు తడిసిపోవడంతో కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. మొక్కజొన్న పంటకల్లాల్లోనే ఉండిపోవడంతో పంటసాగుకు చేసిన అప్పులు చెల్లించేందుకు, ఇతర ఆర్థిక అవసరాలకు రైతులు ఇబ్బందిపడుతున్నారు.

ఇదీ సాగు పరిస్థితి..

గజపతినగరం సబ్‌డివిజన్‌ పరిధిలో 1,545 హెక్టార్లలో మొక్కజొన్న రైతులు సాగుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. రబీలో గజపతినగరం మండలంలో 781 హెక్టార్లు, దత్తిరాజేరు మండలంలో 372 మెంటాడ మండలంలో 329 హెక్టార్లు, బొండపల్లి మండలంలో 63 హెక్టర్లలో మొక్కజొన్న సాగుచేశారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచే పంట చేతికి వచ్చింది. కొన్నిచోట్ల మేలో పంటకోశారు.అయితే గిట్టుబాటు వస్తుందని ధరకోసం కళ్లాల్లోనే కొన్నిచోట్ల సంచుల్లో నిల్వ చేశారు. మరికొన్నిచోట్ల కంకులు ఎండబెడుతున్నారు. అయితే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా 2,090కి క్వింటా కొనుగోలు చేసేలా చర్యలుతీసుకు, ఆ ధర తమకు గిట్టుబాటు కాదని రైతులు కళ్లాలోనే నిల్వచేసి ఉంచారు. ఈనేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారులు పంటకోత సమయంలోనే క్వింటా 2,300 రూపాయలకు కొనుగోలుచేశారు. ఇంతలో కొందరు రైతులు నెలరోజులు పాటు కళ్లాల్లో ఉంచారు. అయితే ప్రభుత్వం క్వింటాకు చెల్లించే ధర పెంచక పోవడంతో రైతులు విక్రయించేందుకు ముందుకురావడంలేదు.

మొలకెత్తుతున్న కంకులు..

వందలాది ఎకరాల్లో చేతికొచ్చిన పంట కల్లాల్లో నిల్వచేయడంతోపాటు ఎండబెట్టారు. ఇంతలో ఇటీవల కురిసిన అకాలవర్షాల పుణ్యమాని మొక్కజొన్న కంకులు తడిపిపోయాయి. కొన్ని గ్రామాల్లో మొలకలు రావడంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. ప్రభుత్వం కూడా కొనుగోలుకు ముందుకురావడంలేదు. దీంతో ఇప్పటికే పంటసాగుకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. గజపతినగరం మండలంలోని సీతారామపురం, పురిటిపెంట, పడిశీల, లింగాలవలస తదితర గ్రామాల్లో అకాల వర్షాలకు పంట తడిసిపోవడంతో మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కజొన్న కంకులు నిల్వచేయడానికి బయట వ్యాపారుల వద్ద ఒక గోనె సంచి రూ.30 చొప్పున కోనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు. ఆరుగాలం కష్ట పడి పంట చేతికి వచ్చే సమయానికి వరుణుడి రూపంలో నష్టపోవాల్సివస్తోందని పలువురు రైతులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పంటనష్టం అంచనాలు వేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

తడిసిమోపెడవుతున్న ఖర్చు..

మొక్కజొన్న సాగు వ్యయం తడిసిమోపెడవుతోందని రైతులు వాపోతున్నారు. ఎకరా సాగుకు విత్తనాల నుంచి ఎరువులు, పురుగు మందులు, నీరు తడి, కూలీల రేట్లు కలుపుకొని 38 నుంచి 40 వేల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ప్రకృతి సహకరిస్తే ఎకరాకు 35 నుంచి 38 క్వింటాల పంట దిగుబడి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే పంట చేతికొచ్చినా ప్రభత్వం క్వింటా రూ.2,090కి మించి కొనుగోలు చేయకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు.

Updated Date - May 15 , 2024 | 11:21 PM