కోడ్ ఉల్లంఘించొద్దు
ABN , Publish Date - Mar 26 , 2024 | 11:27 PM
జీసీసీలో అమ్మకాలు, కొనుగోలులో అవకతవకలకు పాల్పడినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించినా కఠిన చర్యలు తప్పవని జీసీసీ డివిజనల్ మేనేజర్ మహేంద్రకుమార్ హెచ్చరించారు.
జీసీసీ డీఎం మహేంద్రకుమార్
సాలూరు రూరల్, మార్చి 26: జీసీసీలో అమ్మకాలు, కొనుగోలులో అవకతవకలకు పాల్పడినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించినా కఠిన చర్యలు తప్పవని జీసీసీ డివిజనల్ మేనేజర్ మహేంద్రకుమార్ హెచ్చరించారు. మంగళవారం సాలూరు జీసీసీ కార్యాలయంలో పాచిపెంట, సాలూరు, మక్కువ, మెంటాడ, రామభద్రపురం జీసీసీ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్ డిపోలను నిర్ణీత వేళల్లో తెరవాలని, ఎండీయూ ఆపరేటర్లతో సమన్వయం చేసుకుని కార్డుదారులకు సకాలంలో సరుకులు పంపిణీ అందించాలని తెలిపారు. నిత్యం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. అటవీ , వ్యవసాయ ఉత్పత్తులు, డీఆర్స్, వసతిగృహాలకు సరుకులు సరఫరా, వసూలు తదితర అంశాలపై జీసీసీ సాలూరు మేనేజర్ రామారావును అడిగి తెలుసుకున్నారు. సాలూరు బ్రాంచి రూ. 8.12 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటి వరకు రూ. 7.16 కోట్లు సాధించిందన్నారు. పార్వతీపురం డివిజన్ పరిధిలో రూ. 60 కోట్ల లక్ష్యం సాధించినట్టు చెప్పారు. అనంతరం ఆయన జీసీసీ గిడ్డంగిలో సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలిచ్చారు.