Share News

వైభవంగా డోలోత్సవం

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:23 PM

లివిరిలో గోపీనాఽథ రాధారాణి డోలోత్సవాలను ఘనంగా నిర్వహి స్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. ఆ గ్రామంలో భక్తజన సందడి నెలకొంది. రోజూ వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

వైభవంగా డోలోత్సవం
నదిలో భక్తుల సందడి

భామిని: లివిరిలో గోపీనాఽథ రాధారాణి డోలోత్సవాలను ఘనంగా నిర్వహి స్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్సవాలు ప్రారంభమవగా.. ఆ గ్రామంలో భక్తజన సందడి నెలకొంది. రోజూ వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో రాధాకృష్ణలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా మంగళవారం రాధాకృష్ణ ఉత్సవ మూర్తులకు మేళతాళాలతో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న, పెద్దా అంతా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని ఆటపాటలతో పురవీధుల్లో సందడి చేశారు. అనంతరం వంశధార నదిలో భక్తుల నడుమ రాధాకృష్ణ ఉత్సవ మూర్తులకు చక్రతీర్థ స్నానం చేశారు. పర్లాకిమిడికి చెందిన గజపతిరాజుల వారసురాలు కల్యాణి గజపతిరాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంతో పాటు సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, కాశీనగర్‌, గుణుపూర్‌ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హోలీలో పాల్గొని రాధా పాదదర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ నిర్వహించారు.

Updated Date - Mar 26 , 2024 | 11:23 PM