Share News

డోలీయే ఆధారం

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:00 AM

ఒక మనిషిని మరో మనిషి ఆస్పత్రికి మోసుకుని వెళ్లే రోజులు మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో.. చిట్టడవుల్లో సైతం సెల్‌ సిగ్నల్స్‌ ఉంటున్న ఆధునిక ప్రపంచంలో గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు.

డోలీయే ఆధారం
గంగమ్మను డోలికట్టీ తీసుకోస్తున్న దృశ్యం

డోలీయే ఆధారం

శృంగవరపుకోట రూరల్‌, జనవరి 5 : ఒక మనిషిని మరో మనిషి ఆస్పత్రికి మోసుకుని వెళ్లే రోజులు మారడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో.. చిట్టడవుల్లో సైతం సెల్‌ సిగ్నల్స్‌ ఉంటున్న ఆధునిక ప్రపంచంలో గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. సుస్తీ చేస్తే ఇప్పటికీ దేవుడిపై భారం వేయాల్సిన దుస్థితి ఉంది. ఎస్‌.కోట మండలం మూలబొడ్డవర పంచాయతీ చిట్టెంపాడులో తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బాలింత మాదల గంగమ్మకు శుక్రవారం తీవ్రమైన అనారోగ్యం కలగడంతో భర్త గంగులు తోటి గిరిజనుల సహాయంతో ఐదుకిలోమీటర్లు డోలీపై మోసుకుంటూ వెళ్లారు. మైదాన ప్రాంతమైన బొడ్డవర దగ్గరకు చేరాక వాహనంలో ఎస్‌.కోట సీహెచ్‌సీకీ తరలించారు. ఈ పరిస్థితిపై స్థానిక గిరిజన యువకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ ప్రజాప్రతినిధులు చెప్పే మాయమాటలకు మోసపోవడం తమకు అలవాటుగా మారిందని వాపోయారు. రోడ్డు సౌకర్యం అన్న మాట గాలిమూటేనని నిరాశ వ్యక్తం చేశారు.

Updated Date - Jan 06 , 2024 | 12:00 AM