Share News

కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:17 PM

ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని అటవీశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పలు గ్రామాల్లో ఆటో ద్వారా ప్రచారం చేశారు.

కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు
గ్రామాల్లో ప్రచారం చేస్తున్న అటవీశాఖ సిబ్బంది

సీతంపేట: ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదని అటవీశాఖ అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం పలు గ్రామాల్లో ఆటో ద్వారా ప్రచారం చేశారు. శీతాకాలంలో ఏనుగుల ప్రవర్తనలో మార్పు వస్తుందని, వాటి వద్దకు ఎవరూ వెళ్లరాదని, సెల్ఫీల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పారు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఒంటరిగా బయట తిరగరాదని, ఆ సమయాల్లో పొలాలకు కూడా వెళ్లరాదని సూచించారు. పండగలకు గ్రామాల్లోకి వచ్చిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ నెల 17 వరకు ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల్లో విస్తృతంగా ప్రచారంగా చేపడతామని, గజరాజులను పర్యవేక్షిస్తామని అటవీశాఖ పాలకొండ రేంజర్‌ తవిటినాయుడు స్పష్టం చేశారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

Updated Date - Jan 12 , 2024 | 11:17 PM