Share News

విస్తృతంగా తనిఖీలు చేయండి

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:26 AM

షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరంగా చేయాలని, రూ.50 వేలు కంటే ఎక్కువగా నగదు లభిస్తే వెంటనే సీజ్‌ చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆ నగదు ఎన్నికలకు సంబంధించినదైతే కేసు కూడా నమోదు చేయాలన్నారు.

విస్తృతంగా తనిఖీలు చేయండి
కలెక్టరేట్‌ 1: మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

విస్తృతంగా తనిఖీలు చేయండి

నగదు రూ.50వేలు కంటే ఎక్కువ ఉంటే సీజ్‌

నగదు, వస్తువులకు రసీదు ఇవ్వాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 11: క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరంగా చేయాలని, రూ.50 వేలు కంటే ఎక్కువగా నగదు లభిస్తే వెంటనే సీజ్‌ చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. ఆ నగదు ఎన్నికలకు సంబంధించినదైతే కేసు కూడా నమోదు చేయాలన్నారు. ఎన్నికలతో సంబంధం లేకపోతే జిల్లా గ్రీవెన్స్‌ కమిటీకి నివేదించాలని సూచించారు. ఆర్‌వోలు, ఏఆర్‌వోఎలు, ప్లయింగ్‌ స్వ్కాడ్స్‌ సభ్యులతో కలెక్టరేట్‌ నుంచి గురువారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న నగదు లేదా వస్తువుల వివరాలను నమోదు చేసి వాటి యజమానికి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని తెలిపారు. సీజ్‌ చేసిన నగదు లేదా వస్తువుల వివరాలను ఈఎస్‌ఎంఎస్‌ పోర్టల్‌ అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ విస్తృతంగా పర్యటించాలన్నారు. నగదు, వస్తువులను సీజ్‌ చేసినప్పుడు పాటించాల్సిన నియమనిబంధనలను వివరించారు. రూ.10 వేలకు మించి విలువైన బహుమతులను తగిన పత్రాలు లేకుండా తరలిస్తే సీజ్‌ చేయవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, డీఆర్‌వో అనిత, జడ్పీ సీఈవో శ్రీధర్‌ రాజా, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూం పరిశీలన

కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ నాగలక్ష్మి గురువారం పరిశీలించారు. వివిధ విభాగాల కార్యకలపాలను తనిఖీ చేశారు. నమోదు చేసిన కేసులు, తీసుకున్న చర్యలపై కలెక్టర్‌కు సీపీవో బాలాజీ, నోడల్‌ అధికారి సత్య ప్రసాద్‌ వివరించారు.

Updated Date - Apr 12 , 2024 | 12:26 AM