తెలంగాణాలో జిల్లావాసి మృతి
ABN , Publish Date - May 12 , 2024 | 12:20 AM
మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) తెలంగాణాలో రాష్ట్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

సీతానగరం: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన గవర ముసలినాయుడు (సాయి)(24) తెలంగాణాలో రాష్ట్రంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు అందించిన వివరాల ప్రకారం.. సాయి తెలంగాణా రాష్ట్రం భూపల్లి జిల్లాకు చెందిన రామగుండంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శనివారం తన స్నేహితులను దిగబెట్టడానికి వరంగల్ బస్టాండ్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అక్కడ బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాయితో పాటు తన స్నేహితులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్నేహితుడు కూడా ఒకరు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి మరణవార్తను తన స్నేహితులు కుటుంబ సభ్యులకు అందించారు. సాయి మృతితో తండ్రి గోపాలం, తల్లి కన్నతల్లి, చెల్లి రాధ బోరున విలపిస్తున్నారు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు.