Share News

నీటి నాణ్యత కిట్లు పంపిణీ

ABN , Publish Date - Jun 22 , 2024 | 12:25 AM

గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షించి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేసేందుకు నీటి పరీక్ష కిట్లును పంపిణీ చేసినట్లు మండల నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ అధికారి నవీన్‌కుమార్‌ తెలిపారు.

 నీటి నాణ్యత కిట్లు పంపిణీ

కొమరాడ: గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షించి ప్రజలకు సురక్షిత నీటిని సరఫరా చేసేందుకు నీటి పరీక్ష కిట్లును పంపిణీ చేసినట్లు మండల నీటి సరఫరా విభాగం ఇంజినీరింగ్‌ అధికారి నవీన్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ‘కాలం చెల్లిన నీటి పరీక్ష కిట్లు’ పేరిట కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు సచివాలయ ఇంజినీరింగ్‌ సహాయకులకు నూతనంగా కిట్లును అందించారని ఆయన చెప్పారు. గ్రామాల్లో నీటి పరీక్షలను చేపట్టి సురక్షితమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. నూతనం గా పంపిణీ చేసిన కిట్లుకు 2026 సంవత్సరం వరకు నాణ్యత పరీక్షలు ఉపయో గించే రసాయనాలు, ఔషదాల గడువు ఉన్నట్లు ఇంజినీరింగ్‌ అధికారి తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 12:25 AM