Share News

నిరాశే..

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:50 PM

బడ్జెట్‌ ఈసారి కూడా నిరాశనే మిగిల్చింది. జిల్లాకు కనీస స్థాయిలో కేటాయింపులు లేవు. కొత్తవి తేలేదు.. ఉన్న వాటికి నిధులివ్వలేదు. ఇప్పటికే అమలు చేసిన పథకాలు.. వాటికి ఖర్చు చేసిన గణాంకాలను వెళ్లడించేందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీలో బుధవారం రూ.2,86,389 కోట్ల అంచనాతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నాలున్నరేళ్లుగా ఖర్చు చేసిన గణాంకాలనే వివరించారు.

నిరాశే..

నిరాశే..

బడ్జెట్లో కానరాని కొత్తదనం

అరకొరగా కేటాయింపులు

గిరిజన విశ్వ విద్యాలయం ఎప్పటికో

మూతపడిన ఫిష్‌ ఆంధ్రా యూనిట్లు

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

బడ్జెట్‌ ఈసారి కూడా నిరాశనే మిగిల్చింది. జిల్లాకు కనీస స్థాయిలో కేటాయింపులు లేవు. కొత్తవి తేలేదు.. ఉన్న వాటికి నిధులివ్వలేదు. ఇప్పటికే అమలు చేసిన పథకాలు.. వాటికి ఖర్చు చేసిన గణాంకాలను వెళ్లడించేందుకే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రాధాన్యం ఇచ్చారు. అసెంబ్లీలో బుధవారం రూ.2,86,389 కోట్ల అంచనాతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ నాలున్నరేళ్లుగా ఖర్చు చేసిన గణాంకాలనే వివరించారు.

ఫిష్‌ అంధ్రా యూనిట్లు పనిచేస్తున్నాయా?

ఫిష్‌ ఆంధ్రా ద్వారా మత్స్యకారులకు చేయూతనిచ్చినట్లు బుగ్గన వివరించారు. క్షేత్ర స్థాయిలో చూస్తే పూర్తి భిన్నం. అట్టహాసంగా ఫిష్‌ ఆంధ్రా బోర్డులు పెట్టి అమలులో విఫలమైంది. చాలా వరకు ఆ యూనిట్లు మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 22యూనిట్లు తెరిచారు. ఒక్కటీ పనిచేయడంలేదు.

ఫిష్‌ ల్యాండింగ్‌ ఏదీ

రాష్ట్రంలో 10ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి వెళ్లడించారు. 35సమీకృత మత్స్య అభివృద్ధి పథకాలను చేపట్టినట్లు ప్రస్తావించారు. జిల్లాకు సంబంధించి పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరం వద్ద ఏర్పాటు చేయదలచిన ఫిష్‌ ల్యాండింగ్‌ జెట్టీ నిర్మాణం పూర్తి చేసేసినట్లు వెళ్లడించారు. ముఖ్యమంత్రి శంకుస్థాన చేసిన తరువాత అడుగు కూడా అభివృద్ధి జరగలేదు.

గిరిజనాభివృద్ధి ఇదేనా

గిరిజనాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి వివరించారు. కేంద్రం అందించే నిధులతో చేపట్టాల్సిన ట్రైబల్‌ యూనివర్సిటీ పనులు ఇప్పటికీ చేపట్టలేదు. ప్రజలను మభ్య పెట్టేందుకు అట్టహాసంగా స్వయంగా ముఖ్య మంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. ఆ ప్రాంతంలో వేసిన శిలాఫలకం కూడా కన్పించడం లేదు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏలకు చిల్లి గవ్వ నిధులు కూడా విదల్చడం లేదు. కాఫీ తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లా పాచిపెంట మండలం శతాబి, తంగ్లాం గిరిజన రైతులు కాఫీ ఉత్పత్తులను పండిస్తున్నారు. కానీ ఆ ఉత్పత్తులను గిరిజన కార్పొరేషన్‌ కొనుగోలు చేయటం లేదు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా లేకపోయె

తమ ప్రభుత్వం వస్తే అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేటికీ వారి సమస్యను పరిష్కరించలేదు. ఈ బాధితులు వేలాది మంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. కొంత మంది రూ.10వేల లోపు జిపాజిట్‌ దార్లకు కూడా ఏదో వంక చెప్పి చెల్లింపులు చేయలేదు. కాని ఆర్థిక మంత్రి మాట్లాడుతూ అగ్రి గోల్డ్‌ బాధితుల సమస్యలు పరిష్కరించేసినట్లు చెప్పడం గమనార్హం.

పశు బీమా ఏదీ?

పశు బీమా పథకాన్ని బేషుగ్గా అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో వందల మంది రైతులు తమ పశువులను కోల్పోయి నష్టాలకు గురయ్యారు. వారిని బీమాతో ఆదుకోలేదు. జిల్లాలో రూ.11 కోట్లు వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధులు విదల్చని కారణంగా పశు బీమా అమలు కావడం లేదు.

అబాసుపాలైన ఆడుదాం ఆంధ్రా

ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు చాలాచోట్ల అబాసుపాలయ్యాయి. జిల్లాలో క్రీడాకారులు మొగ్గు చూపలేదు. పైగా గొడవలతో చాలాచోట్ల నిలిచిపోయాయి. వీటికి నిర్వహణా ఖర్చులు కూడా ఇవ్వలేదు. గ్రామ స్థాయిలో కొన్ని చోట్ల మొక్కుబడిగా కొన్ని క్రీడా పరికరాలు అందించి చేతులు దులుపుకున్నారు. జిల్లా స్థాయిలో స్థానిక రాజీవ్‌ క్రీడా మైదానంలో జరిగిన పోటీలు రాజకీయ జోక్యంతో వివాదాస్పదం అయ్యాయి.

======

Updated Date - Feb 07 , 2024 | 11:50 PM