Share News

శంబరకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:42 PM

శంబరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఐదోవారం జాతర సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైబడి తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి.

 శంబరకు పోటెత్తిన భక్తులు
శంబర పోలమాంబ

పోలమాంబ దర్శనానికి బారులు

మక్కువ/సాలూరు రూరల్‌, ఫిబ్రవరి 20: శంబరకు మంగళవారం భక్తులు పోటెత్తారు. ఐదోవారం జాతర సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి 25 వేల మందికి పైబడి తరలివచ్చారు. దీంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. కేశఖండనశాల దాటి భక్తజనం బారులుదీరారు. గంటల కొద్దీ నిరీక్షించిన అనంతరం అమ్మవారిని దర్శించి పులకించిపోయారు. గోముఖీ నది తీరంలో కొందరు పోలమాంబకు పూజలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం వనం గుడి వద్ద అమ్మవారు భూస్థాపితమైన చెట్టుకు పూజలు చేశారు. ఇంకొందరు శంబర తోటల్లోనే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సాలూరు డిపో నుంచి పది బస్సులను శంబరకు నడిపారు. ప్రైవేట్‌ వాహనాలను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలిపివేయడంతో మండుటెండలో భక్తులు నడిచి ఆలయానికి చేరుకోవాల్సి వచ్చింది. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత విధులు నిర్వహించారు.

Updated Date - Feb 20 , 2024 | 11:42 PM