Share News

టీడీపీ హయాంలోనే బీసీల అభివృద్ధి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:31 AM

టీడీపీ ప్రభుత్వ కాలంలోనే బీసీల అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు.

టీడీపీ హయాంలోనే బీసీల అభివృద్ధి

పార్వతీపురం, ఆంధ్రజ్యోతి: టీడీపీ ప్రభుత్వ కాలంలోనే బీసీల అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ అన్నారు. గురువారం పార్వతీపురంలోని ఆయన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. బీసీల జనాభా పెరుగుతున్నప్పటికీ బీసీలకు రిజర్వేషన్‌ శాతం పెరగడం లేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉన్నప్పటికీ అటు వైపు చర్యలు తీసుకోకపోవడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. బీసీలకు అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు బీసీలు నడం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోలా వెంకటరావు, జి.రవికుమార్‌, అక్కేన శ్రీనివాసరావు, జాగాన రవిశంకర్‌, టి.వెంకటరమణ, బడే గౌరునాయుడు, కాపవరపు జనార్థన్‌నాయుడు, రాజశేఖర్‌, గంగాడ రామ్మూర్తి, మాజీ విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:31 AM