Share News

సోలార్‌ పంప్‌సెట్‌ ధ్వంసం

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:19 AM

పెదతాడివాడ గ్రామంలో మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు పడాల చిన్నారావుకు చెందిన సోలార్‌ పంప్‌సెట్‌ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని వైర్లను దొంగిలించారు.

 సోలార్‌ పంప్‌సెట్‌ ధ్వంసం

డెంకాడ: పెదతాడివాడ గ్రామంలో మాజీ సర్పంచ్‌, టీడీపీ నాయకుడు పడాల చిన్నారావుకు చెందిన సోలార్‌ పంప్‌సెట్‌ను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని వైర్లను దొంగిలించారు. దీనిపై ఆయన డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులతో చర్చించి పలువురిని టీడీపీలో చేర్పించడం వల్ల తనపై కక్ష కట్టి ఇలా చేశారని ఆరోపించారు. సుమారు రూ.80వేలు నష్టం జరిగినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టి తనకు తగు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Updated Date - Apr 07 , 2024 | 12:19 AM