నాణ్యమైన సరుకులు పంపిణీ చేయండి
ABN , Publish Date - Aug 21 , 2024 | 11:42 PM
నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ కోరారు. బుధవారం ఐటీడీఏ పరిధిలోని 12 గురుకుల పాఠశాలలకు కూరగాయలు, పండ్లు సరఫరాకు టెండర్లు నిర్వహించారు.
సీతంపేట:నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ కోరారు. బుధవారం ఐటీడీఏ పరిధిలోని 12 గురుకుల పాఠశాలలకు కూరగాయలు, పండ్లు సరఫరాకు టెండర్లు నిర్వహించారు. ఇటీవల కూరగా యలు, పండ్లు సరఫరాలో టెండర్‌దారులు తక్కువ ధరకు టెండర్ కోడ్ చేయ డంతో అప్పటి పీవో రాహల్‌కుమార్‌రెడ్డి రద్దు చేసిన విషయం విదితమే. తాజా గా ఇన్‌చార్జి పీవో ఆధ్వర్యంలో ఎస్‌ఆర్ శంకరన్న సమావేశ మందిరంలో టెం డర్లు నిర్వహించారు. టెండర్లలో ఫైనల్ అయిన ధరకే సరఫరా చేయాలని కోరా రు. నాణ్యమైన కూరగాయలు సరఫరా చేయని పక్షంలో టెండర్లు రద్దు చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీవో చినబాబు, డీడీ అన్నదొర, డిప్యూటీ డీఈవో నారాయుడు, జీసీసీ మేనేజర్ దాసరి కృష్ణ పాల్గొన్నారు.
‘పీఎం జన్‌మాన్’ అందరికీ అందాలి
పీఎం జన్‌మాన్ ద్వారా వచ్చే పథకాల లబ్ధి అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ కోరారు.బుధవారం మండ లంలోని దిబ్బగూడలో పీఎం జన్‌మాన్ పథకం ద్వారా గిరిజనులకు అందు తున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏపీవో చినబాబు, ఈఈ సింహాచలం, డీఈ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల సిబ్బందికి అభినందన
సీతంపేట గిరిజనబాలికల గురుకుల రెసి డెన్షియల్ పాఠశాలకు రాష్ట్రస్థాయి లో ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంతో ఐటీడీఏ పీవో అభినందించారు.ఈ మేరకు ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న విషయం విదితమే. ఈ మేరకు ఐటీడీఏ పీవో రమణ బుధవారం పాఠశాల సిబ్బందిని అభినందించారు. కార్య క్రమం లో డీడీ అన్నదొర, ప్రిన్సిపాల్ విజయకుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల తనిఖీ
సీతంపేట రూరల్: గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సీతంపేట ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ ఆదేశించారు.బుధవారం మం డలంలోని చిన్నబగ్గ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలను పీవో ఆకస్మిక తనిఖీ చేపట్టారు.ఆయన వెంట ఏపీవో చినబాబు,టిడబ్ల్యు ఈఈ సిం హాచలం ఉన్నారు.
ఏకలవ్య పాఠశాల పనులు పూర్తి చేయాలి
భామిని: పెండింగ్‌లో ఉన్న ఏకలవ్య పాఠశాల పనులు ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో వీవీ రమణ ఆదేశించారు. బుధవారం పాఠశాలను సందర్శించి పెండింగ్‌లో ఉన్న పనులపై అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఈఈ సింహాచలం, ఇతర సిబ్బంది ఉన్నారు.