రాముని దర్శనం ఉచితంగా కల్పించాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:19 AM
అయోధ్య రాముని దర్శనం పేద హిందువులకు ఉచితంగా కల్పించాలని భజన గురువుల సంఘం ప్రతినిధి కాళ్ల నాగభూషణరావు కోరారు.ఈ మేరకు సోమవారం విజయనగరంలోని కోట జంక్షన్ నుంచి ఆర్టీసీ కాం ప్లెక్స్ వరకూ హిందూభజన గురువులకు ప్రభుత్వం ఆర్థిక సాయంచేయాలని వేల సంఖ్యలో భజన గురువులు, కళాకారులు కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరు నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగభూష ణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోలాటం, చెక్కభజన, తప్పెటగుళ్లు తదితర గురువులకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని కోరారు. ఆయోధ్యతోపాటు, రామేశ్వరం యాత్రకు ఉచితంగా కల్పించాలని కోరారు. ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా హిందువుల పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌చేశారు.
విజయనగరం రింగురోడ్డు: అయోధ్య రాముని దర్శనం పేద హిందువులకు ఉచితంగా కల్పించాలని భజన గురువుల సంఘం ప్రతినిధి కాళ్ల నాగభూషణరావు కోరారు.ఈ మేరకు సోమవారం విజయనగరంలోని కోట జంక్షన్ నుంచి ఆర్టీసీ కాం ప్లెక్స్ వరకూ హిందూభజన గురువులకు ప్రభుత్వం ఆర్థిక సాయంచేయాలని వేల సంఖ్యలో భజన గురువులు, కళాకారులు కళారూపాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరు నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగభూష ణం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోలాటం, చెక్కభజన, తప్పెటగుళ్లు తదితర గురువులకు రూ.10 వేలు వేతనం ఇవ్వాలని కోరారు. ఆయోధ్యతోపాటు, రామేశ్వరం యాత్రకు ఉచితంగా కల్పించాలని కోరారు. ప్రభుత్వ అనుమతులతో సంబంధం లేకుండా హిందువుల పండుగ జరుపుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌చేశారు.