Share News

గంజాయిపై ఉక్కుపాదం మోపండి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:55 PM

ఒడిశా నుంచి గిరిశిఖర గ్రామాల మీదుగా రవాణా చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, మహి ళా, శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.

గంజాయిపై ఉక్కుపాదం మోపండి

సాలూరు: ఒడిశా నుంచి గిరిశిఖర గ్రామాల మీదుగా రవాణా చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, మహి ళా, శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. సోమవారం సాలూరులో పోలీస్‌, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులతో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్ములన, నిరోధంపై సమీక్షించారు. నియోజకవర్గంలో గంజాయి నిరోధిం చేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసలైన వారిని విడిచిపెట్టి అమా యక గిరిజనులపై కేసులు పెట్టి వారిని వైసీపీ ప్రభుత్వం హింసించిందని ఆరోపించారు. వారిని బెయిల్‌పై కూడా తీసుకోని వచ్చే వారు లేకపోవడంతో జైళ్లలో ఖైదీలుగా జీవిస్తున్నారన్నారు. సమావేశంలో పట్టణ , రూరల్‌సీఐలు వాసునాయుడు, బాలకృష్ణ, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.

సంఘటితంగా పోరాటం

గంజాయి నిర్మూలనకు ప్రతిఒక్కరూ పూర్తి స్థాయిలో సంఘటితంగా పోరాడాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కోరారు. సాలూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒడిశామీదుగా గంజాయి ఆర్టీసీ బస్సుల్లో తీసు కొస్తుండడంతో డ్రైవర్లు,కండక్టర్లు అప్పమత్తంగా ఉండాలన్నారు. సాలూరు మండలంలో పొట్టంగి నుంచి సాలూరుకు, ఎగువసెంబి నుంచి సాలూరుకు ఒడిశా నుంచి నందకు వచ్చేమార్గాల్లో నిఘాను ఏర్పాటు ఏర్పాటు చేయాలని కోరారు.సాలూరులో గంజాయి వినియోగంపై ఇద్దరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఎత్తిపోతల పథకం కోసం కృషి

సాలూరు మండలం పెదపధం పంచాయతీ బాగువలస వద్ద సువ ర్ణముఖి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి కృషి చేస్తానని మంత్రి చెప్పారు. ఇది పూర్తయితే సుమారు 3,070 ఎకరాలు సాగుబడిలోకి వస్తుందని అన్నారు. సుమారు ఐదు వేల మంది రైతులకు లబ్ధి చేకూరు తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అఽధ్యక్షుడు పరమేష్‌, కర్రి బుగత భాస్కరరావు, కనకరావు, మరిపి సింహాచలం, పూసర్ల నర్సిం గరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:55 PM