గిరిజన ఉత్పత్తులకు చేయూత
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:41 PM
రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా గిరిజనులు పండించి న పలు ఉత్పత్తులకు మంచి మార్కెట్ ధర లభిస్తోంది.

కురుపాం రూరల్: రైతు ఉత్పత్తిదారు సంఘాల ద్వారా గిరిజనులు పండించి న పలు ఉత్పత్తులకు మంచి మార్కెట్ ధర లభిస్తోంది. ఉద్యానవన శాఖ ఆఽధ్వర్యంలో కురుపాం మండలంలో ఏర్పాటుచేసిన రైతు ఉత్పత్తిదారు సంఘంలో 350 మంది గిరిజనులు సభ్యులుగా ఉన్నారు. వారు పండించే అటవీ ఉత్పత్తులైన కొండచీపురు గడ్డి, జీడిపిక్కలు, చింతపండు, పత్తి పంటలకు మార్కెట్లో లభించే ధరకన్నా అధిక మొత్తం చెల్లిస్తున్నారు. చీపుర్లు తయారు చేసే ముడి సరుకు అయిన చీపురుగడ్డిని గిరిజన సహకార సంస్థ, దళారీలు కిలో ఒక్కంటికి 40 రూపాయలకు కొనుగోలు చేస్తుండగా.. రైతు ఉత్పత్తిదారుల సంఘం ద్వారా కిలో రూ.70కు కొనుగోలు చేస్తున్నారు. మండలంలోని తోలుంగూడ గ్రామం నుంచి ఆదివారం చీపురుగడ్డిని కొనుగోలు చేసి, రవాణా చేశారు. ఈ ముడి సరుకును విశాఖపట్నం, హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు కిలో ఒక్కంటికి రూ.85 అమ్మడం ద్వారా ఖర్చులు పోనూ రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ప్రోత్సాహకర ఆదాయం లభిస్తోం ది. రాబోయే రోజుల్లో సీతాఫలం, పైనాపిల్ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసే ప్రతిపాదన ఉం దంటూ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధి సౌమ్య తెలిపా రు. దీంతో తమకు మంచి మద్ద తు ధర లభిస్తోందంటూ గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు.